తమిళ స్టార్ హీరో సూర్యకు 2026 సంవత్సరం మరచిపోలేని విజయాలను అందిస్తోంది. ఇప్పటికే ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు), ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య.. తాజాగా ‘సీన్’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టారు.
జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రలు పోషించారు.
గత కొంతకాలంగా విజయాల కోసం ఎదురుచూసిన సూర్యకు ఈ మూడు వరుస విజయాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా ‘సీన్’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చాటుకున్నారు!!

