పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. అమెరికాలో జరిగిన తెలుగు టాలెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. చాలా నెలల తర్వాత చిత్ర నిర్మాణంపై అధికారిక సమాచారం రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి!!

