HomeEntertainmentటామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్ విడుదల.. జూలై 30న గ్రాండ్...

టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్ విడుదల.. జూలై 30న గ్రాండ్ రిలీజ్

- Advertisment -

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ నుంచి సెకండ్ ట్రైలర్ విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది.

ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. ట్రైలర్‌లో పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకున్న కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే సరికొత్త సవాళ్లు ఆసక్తికరంగా చూపించారు. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ఘటనల అనంతరం ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మరిచిపోయిన పరిస్థితుల్లో, అతను మరోసారి తన బాధ్యతలను ఎలా స్వీకరించాడనే అంశం కథలో ప్రధానంగా కనిపిస్తోంది.

అదే సమయంలో జెండయా పోషించిన ఎంజే (MJ)తో పీటర్‌కు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని కూడా ట్రైలర్ హైలైట్ చేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, మరింత శక్తివంతమైన విలన్లతో ఈ చిత్రం సూపర్ హీరో అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

‘బ్రాండ్ న్యూ డే’ కథలో పీటర్ పార్కర్ పూర్తిస్థాయిలో స్పైడర్-మ్యాన్‌గా నేరాలతో పోరాడుతూనే, తన గత జీవితాన్ని కోల్పోయిన బాధను మోస్తుంటాడు. తన స్నేహితులు, తనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు తనను గుర్తుపట్టకపోవడం అతని జీవితంలో కీలకమైన మార్పులకు దారి తీస్తుంది. అయితే అదే మార్పు నగరాన్ని, తన ప్రియమైన వారిని రక్షించడానికి అవసరమైన శక్తిగా మారుతుందా? అనేది చిత్రంలో ప్రధాన ఆసక్తికర అంశంగా నిలవనుంది. ముఖ్యంగా ఎవరూ చూడలేని ఓ కొత్త శక్తివంతమైన విలన్‌ను స్పైడర్-మ్యాన్ ఎలా ఎదుర్కొంటాడనేది చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

డెస్టిన్ డానియెల్ క్రెట్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టామ్ హాలండ్, జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో ఒకటైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు భారత్‌లోనూ విశేషమైన అభిమాన వర్గం ఉంది. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ చిత్ర విడుదల తేదీని ఒక రోజు ముందుకు జరిపినట్లు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది.

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ చిత్రాన్ని జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనుంది. 2D, 3D, 4DX 3D, ScreenX, Dolby Cinema, MX4D, P[XL], BIGPIX తదితర ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments