Sunday, September 14, 2025
HomeEntertainmentఅన్ని అవార్డ్స్ ఆవాహయామి

అన్ని అవార్డ్స్ ఆవాహయామి

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న చిత్రం ‘జటాధర’. మహేష్ బాబు జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా శిల్పా శిలోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘ఖుదా గవా’, ‘మృత్యుదంద్’ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ కొల్లగొడతారని ప్రేరణ అరోరా అంటున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘జటాధర’లోని శోభ అనే పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు లెక్కకు మిక్కిలిగా అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. శోభ ఒక శక్తివంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో ఇంటెన్స్‌ను తీసుకు వచ్చి న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments