తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్న చిత్రం “మిరాయ్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రియ శరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రియ శరణ్ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ చేస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను స్వయంగా సమకూర్చుకున్నారు!!

