HomeEntertainmentనిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాథ్ రెడ్డి స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి...

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాథ్ రెడ్డి స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్

- Advertisment -

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

తాజాగా మేకర్స్ ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని క్యాచి గా ట్యూన్ గా కంపోజ్ స్వయంగా అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అదే సమయంలో క్యారెక్టర్స్‌పై ఆసక్తిని పెంచేలా పాటను తెరకెక్కించారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments