HomeEntertainmentసిగ్మా సాంగ్ రిలీజ్

సిగ్మా సాంగ్ రిలీజ్

- Advertisment -

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిగ్మా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments