HomeNewsశభాష్ సాయి రాఘవేంద్ర

శభాష్ సాయి రాఘవేంద్ర

- Advertisment -

ఇంటర్నేషనల్ యోగాసన చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్

భారత యోగాసన ప్రతిభ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరిచిన సాయి రాఘవేంద్ర, మలేషియాలోని కౌలాలంపూర్‌లో మే 16 నుంచి 19 వరకు జరిగిన 11వ వరల్డ్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.


6 నుంచి 10 సంవత్సరాల వయస్సు విభాగంలో పాల్గొన్న సాయి రాఘవేంద్ర తన అద్భుతమైన యోగాసన ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల నుంచి వచ్చిన పోటీదారుల మధ్య స్వర్ణ పతకం సాధించడం విశేషం.

ఈ విజయంతో సాయి రాఘవేంద్ర కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగురవేసిన ఈ బాల ప్రతిభకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments