HomeEntertainmentహై హై నాయకా అంటున్న ఎస్. కృష్ణ

హై హై నాయకా అంటున్న ఎస్. కృష్ణ

- Advertisment -

హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేసి, పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు కో-రైటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడంతోపాటు కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఎమోషన్స్, డ్రామా, హై ఎనర్జీ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘హై’ థియేటర్లలో విడుదల కానుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments