నవంబర్ 5న విడుదలవుతున్న రామాయణం చిత్రం మ్యూజిక్ కోసం మూడున్నర సంవత్సరాలు శ్రమించామని, ఇది తన కెరీర్ లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు ఏ.ఆర్.రెహమాన్. మరో ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ తో కలిసి రెహమాన్… ఈ చిత్రానికి సంగీతం చేశారు. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ రామాయణం చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు!!

