HomeEntertainmentగాంధీ జయంతికి రూపాయనమ:

గాంధీ జయంతికి రూపాయనమ:

- Advertisment -

చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రూపాయనమ:’. ఈ సినిమాలో అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి ప్రధాన పాత్రలను పోషించారు. కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఫ్యామిలీ, కామెడీ అంశాలతో పాటుగా థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాల్ని కూడా జోడించారు. ఈ మూవీని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. రెండు గంటల 13 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది.
‘రూపాయనమ:’ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ, సస్పెన్స్, హ్యూమర్ ఇలా అన్ని అంశాలను జోడించి రూపొందిన ఈ చిత్రం మొదటి పోస్టర్ మరియు టైటిల్ సాంగ్ ను దర్శకులు తరుణ్ భాస్కర్ విడుదల చేసారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments