
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైసా’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘ఓ మైసా రే’లో రష్మిక చాలా పవర్ఫుల్, ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి తన పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. మొదటి పాటలోని హై ఎనర్జీ, యాక్షన్ మూడ్‌కు భిన్నంగా ఇప్పుడు మేకర్స్ రెండో పాట ‘ఏనాటి వరమో నువ్వు’ను రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ పాటకు మంచి మెలోడీని అందించారు. కృష్ణ తేజస్వి తన వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. రెహమాన్ రాసిన లిరిక్స్ ఒక తండ్రికి తన కూతురిపై ఉండే ప్రేమను, ఆప్యాయతను చక్కగా తెలియజేస్తున్నాయి.
ఈ పాటలో మైసా చిన్నప్పటి రోజులను చూపించారు. రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో సముద్రఖని, ఈశ్వరీ రావు నటించారు!!
