మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. విడుదలైన మరు నిమిషం నుంచే ఈ ప్రచారచిత్రం ప్రకంపనలు పుట్టిస్తోంది.

