సూర్య, వివేక్ ఒబెరాయ్, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం “రక్తచరిత్ర”. కొత్త టెక్నాలజీని మేళవించి సినిమాలను తీయడంలో పేరుగాంచిన వర్మ ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ప్రతిబింబంగా రూపొందించారు. రాయలసీమలోని అనంతపూర్ లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఫ్యాక్షనిజంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న అంశాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

