(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’)
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘యమ కింకరుడు’. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ: “తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. AI సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా తీయడం అభినందనీయం. ట్రైలర్ చాలా వినూత్నంగా, ఆసక్తికరంగా ఉంది. సుమన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అనిఅన్నారు!!
హీరో, దర్శకుడు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ: “మా ‘యమ కింకరుడు’ ట్రైలర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించిన కె.ఎస్. రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో తొలి AI చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మాకు ఎంతో గర్వకారణం. సుమన్ గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు!!

నటీనటులు:
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుమన్ తదితరులు….
సాంకేతికవర్గం:
పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ
సాంకేతికత: AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం: తుమ్మలపల్లి రామసత్యనారాయణ!!
