HomeEntertainment2 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ "చిరంజీవి"...

2 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

- Advertisment -

కంటెంట్ బాగున్న చిన్న చిత్రాల సక్సెస్ ట్రెండ్ ను కొనసాగిస్తూ కికు యనమల హీరోగా నటించిన యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా 2 రోజుల్లోనే 1.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. థియేట్రికల్ గా ఇదే స్థాయి పర్ ఫార్మెన్స్ కొనసాగిస్తే ఫస్ట్ వీక్ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. “చిరంజీవి” సినిమాలోని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఊహకు అందని స్క్రీన్ ప్లేతో పాటు యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

“చిరంజీవి” సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కశిష్ ఖాన్, ఈశ్వరీరావ్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్ ఇతర కీ రోల్స్ లో నటించారు. ఈ నెల 28న రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద రక్షాబంధన్ విన్నర్ గా మారింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments