HomeEntertainmentయువరాజు నుంచి రారాజుగా

యువరాజు నుంచి రారాజుగా

- Advertisment -

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ‘విక్రమ్’తో 1986లో తెరపైకి వచ్చిన నాగార్జునకు అది కేవలం హీరోగా తొలి అడుగు మాత్రమే. కానీ ఆ అడుగు తర్వాత రోజుల్లో “హీరో” నిర్వచనాన్నే మార్చే స్థాయికి వెళ్లింది. 1989లో వచ్చిన ‘శివ’ నాగార్జున కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ ఒక మలుపు. ఆ చిత్రం నాగ్‌ను కేవలం హీరోగా కాకుండా యూత్ ఐకాన్‌గా నిలబెట్టింది.
అదే సంవత్సరంలో వచ్చిన ‘గీతాంజలి’ నాగార్జునలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
నాగార్జున ప్రత్యేకత ఏమిటంటే—ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకపోవడం.
“నిర్ణయం, అంతం, కిల్లర్, హలో బ్రదర్, క్రిమినల్, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్, శ్రీరామదాసు, రాజన్న”….. ప్రతి దశలోనూ కొత్త కథలు, కొత్త పాత్రల కోసం ప్రయత్నించాడు… పరితపించాడు. ముఖ్యంగా ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ వంటి పాత్రలు నాగార్జునకు ఒక ప్రత్యేకత ఆపాదించాయి. వయసు పెరుగుతున్న కొద్దీ తనను తాను రీ-ఇన్వెంట్ చేసుకున్న హీరో నాగార్జున.
అందుకే ‘కింగ్’ అనే పేరు 2008లో వచ్చిన సినిమాకే పరిమితం కాలేదు. అది క్రమంగా నాగార్జునకు బిరుదుగా మారింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం నాగ్ కు మాత్రమే చెల్లింది.
ఇప్పుడు ఆ ప్రయాణం మరో చారిత్రక మైలురాయిని చేరింది. నాగార్జున 100వ చిత్రానికి ‘King100’ అనే టైటిల్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది
తమిళ తంబి రా కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కుటుంబ నేపథ్యంతో కూడిన ర్యాగ్స్-టు-రిచెస్ కథగా రూపొందుతోంది. సినిమాలో ఆయన పాత్ర 32 ఏళ్ల వయసు నుంచి ప్రస్తుత వయసు వరకు ప్రయాణిస్తుందని సమాచారం!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments