ఐదుగురు భామలు ఐదు భిన్నమైన షేడ్స్
యష్ నటిస్తున్న ‘టాక్సిక్’పై అంచనాలు పెంచుతున్న అంశాల్లో హీరోతోపాటు సినిమాలో కనిపించనున్న ఐదుగురు అందాల భామలు కూడా ఒకటి. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్… ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. నయనతార తన గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోనుండగా… కియారా గ్లామర్‌తో పాటు యష్‌తో కెమిస్ట్రీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
హుమా ఖురేషీ ఇంటెన్స్ లుక్‌తో, తారా సుతారియా ఫెయిరీ-టేల్ చార్మ్‌తో, రుక్మిణి వసంత్ ఎలిగెన్స్‌తో ‘టాక్సిక్’ ప్రపంచానికి భిన్నమైన రంగులు అద్దుతున్నారు.
ఐదుగురు భామలు… ఐదు రకాల అందాలు… ఐదు విభిన్నమైన పాత్రలు!
అయితే ఈ గ్లామర్ కేవలం తెరను అందంగా మార్చడానికేనా?
లేక కథలో కీలక మలుపులు తిప్పే పాత్రలా? అసలు ‘టాక్సిక్’లో ఈ అందాల భామల ‘పవర్’ ఎంతుందో తెరపై చూడాల్సిందే!

