HomeEntertainmentఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటానికి “పర్సెంటేజ్ షేరింగ్” విధానానికి నా పూర్తి మద్దతు - చదలవాడ శ్రీనివాసరావు

ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటానికి “పర్సెంటేజ్ షేరింగ్” విధానానికి నా పూర్తి మద్దతు – చదలవాడ శ్రీనివాసరావు

- Advertisment -

సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపుకు సంబంధించి ప్రతిపాదిత “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” అమలుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కీలక అంశాలు, నిర్ణయాలను వెల్లడించారు.

మీడియా సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఒక నిర్మాతగా మాట్లాడాలంటే నిర్మాత తండ్రి అయితే, ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడు. అలా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి గిట్టుబాటు లేక, ఆదరణ లేక పరిస్థితులు క్షీణించాయి. గత ఏడాది నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి  అస్సలు బాలేదు. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. సునీల్ నారంగ్ గారు, శిరీష్ గారు అందరూ కూడా థియేటర్ల అభివృద్ధి కోసం తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నిర్మాతగా వారికి నా 100 శాతం సపోర్ట్ ఉంటుంది. ఎగ్జిబిటర్లను బ్రతికించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సినిమా పరిశ్రమ మరింత బలపడేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను” అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments