నటుడు – నిర్మాత షెరాజ్ మెహదీ
తెలుగు సినిమా మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోందని ‘ఓ అందాల రాక్షసి’ హీరో, నిర్మాత షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిలీజ్ కే కాదు, రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, ఈ విషయంపై లీగల్‌గా పోరాటం చేస్తానని తెలిపారు.
చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, “ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉంది” అని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయని, ADCC వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయని తెలిపారు.
చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని, ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఇండస్ట్రీ పెద్దల్ని కోరారు!!

