మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి – రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు.
తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు.ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు Chitram Srinu కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
నిర్మాతలు – C.H.V శర్మ, MSN మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -మేరీ జెన్నిఫర్
దర్శకత్వం – మహి, రాజశేఖర్
కథ: మహి
సినిమాటోగ్రాఫర్ – మల్లూ నాయక్
సంగీతం – విశ్వదీప్
ఏడిటర్ – హర్షిత్ కొటా
కాస్ట్యూంస్ – ప్రణతి
పబ్లిసిటి – చిన్మయి
PRO – వీర బాబు

