ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథలను భారీ సినిమాటిక్ విజన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ యూనివర్స్‌కు పునాది వేసిన ‘హనుమాన్’ సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, ‘మహాకాళి’ మరో ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, ఖుష్బూ సుందర్, భూమి శెట్టి, రోహిత్ సారఫ్, రాకేష్ బేడీ, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆర్కే దుగ్గల్ సమర్పణలో, ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహాకాళి’ 2027 జనవరి 8న థియేటర్లలో విడుదల కానుంది. ‘అయిగిరి నందిని’ పాటతో మేకర్స్ సినిమాకు అద్భుతమైన మ్యూజికల్ ఇంట్రడక్షన్ ఇచ్చారు.

