HomeEntertainmentఇట్లు అనస్వర అనిపించుకోవాలన్నదే నా అభిలాష

ఇట్లు అనస్వర అనిపించుకోవాలన్నదే నా అభిలాష

- Advertisment -

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-తెలుగులో నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. కాకపోతే ‘ఛాంపియన్’ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది.

  • ఇట్లు అర్జున్ లో చేసిన కీర్తి క్యారెక్టర్ చాలా యూత్‌ఫుల్ అండ్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కథ విన్నప్పుడు నేను కీర్తి క్యారెక్టర్‌తో చాలా కనెక్ట్ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ను ప్లే చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.

ఇందులో హీరోకి మాటలు ఉండవు. నాకు కథలో ఆకర్షించిన విషయాల్లో అది ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా కోసం నేను, అనీష్ కలిసి వర్క్ షాప్స్ చేశాం. సీన్స్ సీన్స్ ను చాలా ప్రాక్టీస్ చేశాం. మా ఇద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చాయి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments