M4M నిర్మాత మోహన్ వడ్లపట్ల బంపర్ ఆఫర్
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకతగా నిలిచింది.
దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ:
సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తున్నాం. M4M యూనివర్సల్ సబ్జెక్ట్. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని పేర్కొన్నారు!!

