అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. జూలైలో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌తో తొలి ఆట నుంచే వసూళ్లతో తనదైన సత్తాను చాటడమే కాకుండా రీసెంట్‌గా రూ.100 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. థియేటర్స్‌లో ఆడియెన్స్‌ను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటింట ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది.
డిఫరెంట్ కంటెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకుల మనస్సుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా ఇంట్రెస్టింగ్ మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను అనౌన్స్ చేసి అందరిలో తెలియని ఓ సరికొత్త ఉత్సాహాన్ని నింపిన జీ5. అందులో భాగంగా లెనిన్ సినిమాను అందిస్తుండటం విశేషం.
ఈ సందర్బంగా నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘ఆగస్ట్ నా బర్త్‌డే మంత్. లెనిన్ సినిమాను థియేటర్స్‌లో ఆదరించారు. అందుకు థాంక్స్. ఇప్పుడు మనోడు డైరెక్ట్‌గా ఆగస్ట్7న మీ ఇంటికి వచ్చేస్తున్నాడు. అలాగే చూడండి.. ఆదరించండి..సినిమాను ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
90వ దశకంలో రూపొందిన చిత్రమిది. చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం గ్రామంలో ప్రతీ ఏటా 18 రోజుల పాటు ద్రౌపదమ్మ జాతరను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతర జరిగినన్ని రోజులు ఆ ప్రాంతంలో ఒక రక్తపు చుక్క చిందకూడదనేది ఆచారంగా కొనసాగుతుంటుంది. ఆ ప్రాంతానికి అనాథ అయిన లెనిన్(అఖిల్) వస్తాడు. ఈశ్వరీ రావు ఆమె తనయుడు ప్రమోద్ పంజు లెనిన్‌ను ఆదరిస్తారు. క్రమంగా లెనిన్, ప్రమోద్ మంచి స్నేహితులుగా ఎదుగుతారు. అఖిల్, భాగ్యశ్రీబోర్సె ప్రేమలో పడతారు. అక్కడి నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతాయి. అఖిల్ జైలు పాలవుతాడు. ఇంతకీ అఖిల్ ఎందుకు జైలు పాలవుతాడు? జైలు నుంచి వచ్చిన అఖిల్ ఎవరిపై పగ సాధించాలనుకుంటాడు? అందుకు కారణమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రా అండ్ రస్టిక్ పాత్రలో అఖిల్ పెర్ఫామెన్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. భాగ్యశ్రీ బోర్సె గ్లామర్‌తో పాటు నటనతో మెప్పించింది. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకింగ్ వేల్యూస్.. డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు కథ, కథనం, టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. లియోన్ బ్రిట్టో కెమెరావర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాని నిలబెట్టాయి.
జీ5 గురించి…
భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా, లక్షలాది వినోద ప్రియులకు హాట్ ఫేవరేట్‌గా జీ5 దూసుకుపోతోంది. జీ5 గ్లోబల్ కంటెంట్ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) సంస్థ నుండి వచ్చింది. వినియోగదారులకు తిరుగులేని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్‌గా ఇది 4,071కి పైగా సినిమాలు, 1,800కి పైగా టీవీ షోలు, 422కి పైగా వెబ్ ఒరిజినల్స్, 4,492కి పైగా మ్యూజిక్ వీడియోలు, 1.35 లక్షల గంటలకు పైగా ఆన్-డిమాండ్ కంటెంట్‌తో కూడిన విస్తృతమైన, విభిన్నమైన ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. విస్తరించి ఉన్న 7 పర్సనలైజ్డ్, హైపర్-లోకల్ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లతో ఈ కంటెంట్ ఇప్పుడు మా విభిన్న ప్రేక్షకులకు 12 భాషలలో – హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీలో అందుబాటులో ఉంది.
ఓరిజినల్స్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, పిల్లల కంటెంట్, న్యూస్, లైవ్ టీవీ, మైక్రో డ్రామాలు వంటి విభిన్న కంటెంట్‌తో విస్తారమైన లైబ్రరీ కలిగిన జీ5, భారతీయ ప్రేక్షకులకు బహుభాషా వినోదం, లైవ్ స్పోర్ట్స్ అనుభవాన్ని అందించే ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. అలాగే, జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు FIFAతో 2034 వరకు ఉన్న దీర్ఘకాల భాగస్వామ్యం వల్ల, భారత్‌లో FIFAకి సంబంధించిన ప్రముఖ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో వీక్షించవచ్చు. ఇందులో FIFA వరల్డ్ కప్ 2026™ మరియు 2030 కూడా ఉన్నాయి.

