HomeEntertainment‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’

- Advertisment -
  • అఖిల్ అక్కినేని హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌
  • జూన్ 26న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుద‌ల‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సాంగ్‌తో మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట‌గా విడుద‌లైంది. చ‌క్క‌టి మ్యూజిక్ ట్రాక్‌తో ఈ పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ జోష్‌తో నిండిన డాన్స్ మెలోడీ క్యాచీ బీట్స్, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. ఈ ఇద్ద‌రి జోడీని స్క్రీన్‌పై చూస్తుంటే చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది.

త‌న‌దైన సిగ్నేచ‌ర్ హుక్స్‌, బీట్స్‌తో సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాస్ మెలోడీని అద్భుతంగా కంపోజ్ చేశారు. సింగ‌ర్ శ్రీకృష్ణ‌తో క‌లిసి త‌మ‌న్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. భాస్క‌ర‌భ‌ట్ల ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు. ప్ర‌తీ ప‌దం వినసొంపుగా లోక‌ల్ ట‌చ్‌తో రొమాంటిక్ స్టైల్లో ఉన్న‌ట్లు అనిపిస్తోంది.

‘లెనిన్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోంది. అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:

అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీ కిశోర్ అబ్బూరు
నిర్మాత‌లు: అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ వంశీ
బ్యాన‌ర్స్‌: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: అన్న‌పూర్ణ స్టూడియోస్‌
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్ల‌

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments