HomeEntertainmentఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

- Advertisment -

ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా (LADIA) సంస్థ ఖమ్మంలో తన ఏడో స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో, వినూత్నత, విశ్వసనీయత మరియు కస్టమర్-ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్న లాడియా, ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది.


ఖమ్మంలోని ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ నటి నేహా శెట్టి అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ,
“ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారత్ విశేష పురోగతి సాధించింది. ఈ రంగంలో మరిన్ని వినూత్న ఆలోచనలను అందిస్తూ ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి లాడియా కట్టుబడి ఉంది. తెలంగాణలోని ప్రముఖ జ్యువెలరీ కేంద్రం ఖమ్మంలో మా ఏడో స్టోర్‌ను ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ల్యాబ్-గ్రోన్ డైమండ్లు పేరుకు తగ్గట్టుగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి సహజ వజ్రాల మాదిరిగానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆప్టికల్ లక్షణాలను కలిగి ఉంటాయి. సహజ వజ్రాలకు ఉపయోగించే అదే కలర్, క్లారిటీ ప్రమాణాలతో వీటిని కూడా గ్రేడ్ చేస్తారు.
లాడియాలో బంగారు ఆభరణాలతో రూపొందించిన డైమండ్స్ మరియు సాలిటైర్స్ విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. హారాలు, వడ్డాణాలు, నెక్లెస్‌లు, గాజులు, పెండెంట్లు, బ్రేస్‌లెట్లు, చెవిపోగులు, జుంకాలు, ఉంగరాలు మరియు ప్రత్యేక ల్యాబ్-గ్రోన్ పోల్కీలు వినియోగదారులకు లభ్యమవుతాయి.
అలాగే లాడియా ప్రత్యేక కస్టమైజేషన్ సదుపాయాన్ని అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చిన డిజైన్‌ను స్వయంగా రూపొందించుకోవచ్చు. ఆభరణం రూపకల్పన ప్రక్రియలో ప్రతి దశలో భాగస్వామ్యం కావచ్చు. అంతేకాకుండా, డైమండ్ గ్రేడింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన IGI (International Gemological Institute) నుంచి ధృవీకరణ పత్రాలు కూడా అందిస్తారు.
లాడియా సంస్థ 24 క్యారెట్ల పాత బంగారంపై ఫుల్ వాల్యూ గోల్డ్ ఎక్స్చేంజ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. పాత బంగారాన్ని ఇచ్చి నూతన డిజైన్ల జ్యువెలరీని పొందవచ్చు.


డైమండ్ ధరలు ప్రతి క్యారెట్‌కు రూ.24,999 (EF-VVS) నుంచి ప్రారంభమవుతాయి. విభిన్నమైన ప్రత్యేక కలెక్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభోత్సవం సందర్భంగా లాడియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 2026 మే 30 నుంచి జూన్ 14 వరకు:
సాలిటైర్ డైమండ్స్‌పై ఫ్లాట్ 25% డిస్కౌంట్
డైమండ్స్ మరియు మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% డిస్కౌంట్
జీరో వేస్టేజ్ ఆఫర్
ఈ ప్రత్యేక ఆఫర్లతో ఖమ్మం ప్రజలకు అత్యుత్తమ ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీని మరింత అందుబాటు ధరల్లో అందించనున్నట్లు లాడియా సంస్థ వెల్లడించింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments