కింగ్ నాగార్జున అక్కినేని ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ సీజన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న సందేహాలకు తెరదించుతూ, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని టీమ్ స్పష్టం చేసింది. థియేటర్లలోకి సినిమా రావడానికి సరిగ్గా 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు!!

