
నవంబర్ 16న హైదరాబాద్‌లో పురస్కార ప్రదానం
వైవిధ్యభరితమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ కథానాయకుడు సుమన్‌కు 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ లభించనుంది.
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా గత 24 సంవత్సరాలుగా కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, వివిధ రంగాలకు చెందిన సినీ ప్రముఖులను సత్కరిస్తూ ఆయన పేరుతో జాతీయ పురస్కారాలను అందిస్తున్నాయి.
ఈ క్రమంలో 2026 సంవత్సరపు పురస్కారానికి హీరో సుమన్‌ను ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ ప్రకటించింది.
సుమారు 300కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన సుమన్ తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్ హీరోగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా, కరాటే యోధుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన, మరోవైపు పౌరాణిక పాత్రల్లోనూ అద్భుతమైన అభినయంతో మెప్పించారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లో ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది.
విభిన్నమైన పాత్రలతో నటుడిగా తన బహుముఖ ప్రతిభను చాటుకున్న సుమన్‌ను కత్తి కాంతారావు జాతీయ పురస్కారంతో గౌరవించాలని తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ గౌరవ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జన్మదినమైన నవంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సుమన్‌కు ప్రదానం చేయనున్నారు.
ఈ విషయాన్ని అవార్డు కమిటీ చైర్మన్ కె.వి. రమణాచారి (IAS), కో-చైర్మన్లు సి. పార్థసారథి (IAS, రిటైర్డ్), నాగబాల డి. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు!!
