HomeEntertainmentకదిరి కాళిదాస్ షార్ట్ కట్ లో కాకా

కదిరి కాళిదాస్ షార్ట్ కట్ లో కాకా

- Advertisment -

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంది. దీంతో సినిమాలో కదిరి కాళిదాస్ క్యారెక్టర్ జర్నీ, ఎమోషనల్ ఆర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments