పెద్ది చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు విపరీతమైన ప్రశంసలు లభిస్తుంటే చిత్ర హీరోయిన్ జాన్వీకపూర్ పరిస్థితి భిన్నంగా ఉంది. “దేవర” తర్వాత “పెద్ది” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి తనయకు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. పైగా ఈ చిత్రానికి ఆమె పెద్ద మైనస్ అని విమర్శలు వస్తుండడం బాధాకరం. జాన్వి పోషించిన “అచ్చియమ్మ” పాత్ర రూపకల్పనలో చిత్ర దర్శకుడు సానా బుచ్చిబాబు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, ఆమె ట్రాక్ కూడా బాగుండి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని యునానిమస్ గా చెబుతున్నారు. నిజానికి ఈ చిత్రంపై జాన్వి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతానని ఆమె భావించింది. కానీ అందుకు భిన్నంగా ఆమె పాత్ర చిత్రీకరణ జరిగిందంటున్నారు!!

