HomeEntertainmentఐ హేట్‌ మ్యారేజ్‌ బోల్డ్‌ సినిమనే కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌ సినిమా: దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల

ఐ హేట్‌ మ్యారేజ్‌ బోల్డ్‌ సినిమనే కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌ సినిమా: దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల

- Advertisment -

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’. పరమేష్‌ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్‌, కార్తీక్‌ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు Vijay C Kumar డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని అందించారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్‌.

ఈ సందర్బంగా సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ ” ఈ సినిమా కోసం దర్శకుడితో కలిసి చాలా కాలం ట్రావెల్‌ చేశాను. దర్శకుడు పరమేష్‌లో ఎంతో తపన ఉంది. దర్శకుడిగా ఆయన ప్రతిభ ఏమిటో ఈ సినిమాతో అందరికి తెలుస్తుంది. దర్శకుడి ఎక్కడా రాజీ పడడు. ఈ రోజు ఈ సినిమాతో పరమేష్ దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

ఎడిటర్‌ ఆవుల వెంకటేష్‌ మాట్లాడుతూ ” దర్శకుడు పరమేష్‌ ఎంతో క్రియేటివ్‌ పర్సన్‌. పరమేష్‌ను దర్శకుడి చేయడం కోసం వాళ్ల స్నేహితుల అంతా కంట్రిబ్యూట్‌ చేశారు. ఇదొక మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ. తప్పకుండా నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు.

నిర్మాత మాదం దయానంద్‌ మాట్లాడుతూ ” విజయ్‌.సి.కుమార్‌ గారు మా సినిమాకు వర్క్‌ చేస్తున్నారు అనగానే మాలో ధైర్యం వచ్చింది. మా చిత్ర విజయంపై కాన్ఫిడెన్స్‌ పెరిగింది. తప్పకుండా ఇలాంటి కొత్త సినిమాలకు ఆడియన్స్‌ ఆదరణ అవసరం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాను. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులోని భావోద్వేగాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా, నిజ జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది.

హీరోయిన్‌ జుప్సీ భద్ర మాట్లాడుతూ ఈ కథ వినగానే ఎంతో పవర్‌ఫుల్‌ కథ అనిపించింది. దర్శకుడు ఎంతో క్లారిటితో ఈసినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తప్పకుండా యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది’ అన్నారు.

రేణికుంట్ల పరమేష్‌ మాట్లాడుతూ ” మాట్లాడుకోవడానికి చదవడానికి ఇష్టపడని సంఘటనలు మన కళ్ల ముందు జరిగితే రకరకాల డిస్కషన్స్‌ చేస్తుంటారు. అలాంటి సంఘటనల సమహారమే ఈ చిత్రం. ఈ ట్రైలర్‌ చూడగానే ఇంత బోల్డ్‌ కంటెంట్‌తో ఎందుకొస్తున్నావు అని అందరూ అన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇది బోల్డ్‌ కంటెంట్‌ కాదు… చూడటానికి ఇష్టపడని.. మెచ్యూర్డ్‌ కంటెంట్‌.. అమ్మాయిలు. అబ్బాయిలు.. కలిసి తిరుగుతున్నారు.. కానీ పెళ్లి మాత్రం ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధాలనే చేసుకుంటున్నారు. అయితే ప్రేమించిన వాళ్లను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు.. ఇంట్లో ఎందుకు ఫైట్‌ చేయడం లేదు అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. నేడు సొసైటిలో జరుగుతున్న కథ. ప్రతి ఒక్కరూ వాళ్లకు తెలిసిన వాళ్ల కథను చూస్తున్నామనే భావన కలుగుతుంది. నేడు సొసైటిలో చూస్తున్నదే ఈ సినిమాలో తీశాను. జెన్‌జీ నచ్చే కథ ఇది. ఇది బోల్డ్‌ సినిమా కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌స్టోరి ఇది. ఒక దర్శకుడిగా ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ” సొసైటిలో ఉన్న డార్క్‌ సిక్రెట్‌.. డేరింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి.
కొత్త దర్శకుడు ఓ కొత్త కథ, ఓ మంచి కథ చెప్పాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాడు. ఎంతో అనుభవంతో ఓ కొత్త నిజాన్ని చెప్పబోతున్నాడు. ఇది బోల్ట్‌ అనుకునే వాళ్లకు బోల్డ్‌ కథ. ఓ ముగ్గురి అమ్మాయిల జర్నీ.. ఓ అబ్బాయి కథ ఈ సినిమాను దర్శకుడు ఎక్కడా బోర్‌ కొట్టించడకుండా సినిమా ఆద్యంతం బాగా డీల్‌ చేశాడు. ఓ ఇన్‌స్పిరేషన్‌లా సినిమాలా ఉంటుంది. ఈ రోజు సమాజంలో జరుగుతున్న సంఘటనలకు దగ్గరగా ఉంటూ కమర్షియల్‌గా ఉంటుంది. ఈసినిమా విడుదల తరువాత అందరూ ఈ సినిమా గురించి డిస్కస్‌ చేసుకుంటారు’ అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments