HomeEntertainmentతెలుగు సినిమాల్లో దుల్కర్ సల్మాన్‌

తెలుగు సినిమాల్లో దుల్కర్ సల్మాన్‌

- Advertisment -

తెలుగు సినిమాల్లో దుల్కర్ సల్మాన్‌కు పెరుగుతున్న అవకాశాల వెనుక కేవలం అతని నటనో, మలయాళ మార్కెట్టో మాత్రమే కారణం కాదు. కొంచెం లోతుగా పరిశీలిస్తే నిర్మాతలకు అతను ఒక సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడు.

మొదటిది.. ఒకప్పుడు నాని, నితిన్ లాంటి హీరోలు చేసిన ప్రత్యేకమైన Genre, Concept-oriented సినిమాలకు ఇప్పుడు వేకెన్సీ ఉంది. వరుస పరాజయాలో, కథల ఎంపికలో వచ్చిన మార్పులో, Tier-2 నుంచి Tier-1కి ఎదగాలనే తపనలోనో… కారణం ఏదైనా, ఆ తరహా ప్రయోగాలకు కొందరు హీరోలు దూరమయ్యారు. ఆ ఖాళీలోకి ఇప్పుడు దుల్కర్ వచ్చాడు.

రెండు:

మన తెలుగు సినిమా మార్కెట్‌లో హీరోకు తగ్గ బడ్జెట్, బడ్జెట్ కు తగ్గ కలెక్షన్స్, కలెక్షన్స్ కు తగ్గ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ అంటూ లెక్కలేనన్ని పరిమితులు. సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాని లెక్కడొక్కా తెగేసరికి డొక్క పగలడం ఖాయం.

తక్కువ అని చెబితే చిన్న సినిమా అంటారు. ఎక్కువ బడ్జెట్ అని చెబితే అంత కలెక్షన్స్ రావాలి కదా అంటారు. కలెక్షన్స్ తగ్గితే పరువు పోతుంది. పెంచి చెబితే Tax-related complications. చివరికి సినిమా కంటే దాని పోస్టర్లలోని కలెక్షన్లకే ఎక్కువ Publicity!

అదిగో అప్పుడే దుల్కర్ లాంటి హీరో ఒక మంచి ప్రత్యామ్నాయం. అతనితో సినిమా తీస్తే నిర్మాతకు ప్రతి సినిమాకీ భారీ Openings, వందల కోట్ల Collections ప్రకటనలు, అభిమానుల లెక్కలు, Records రచ్చ అవసరం లేదు.

నిజమైన ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలి. సినిమా నచ్చాలి. నలుగురికి చెప్పాలి. ఆ Mouth Talkతో ఇంకో నలుగురు రావాలి. అంతే.. సినిమా వర్కవుట్ అవుతుంది. నిర్మాతకు Profitability ఉంటుంది. వచ్చిన నిజమైన లాభాలను భాగస్వాములు పంచుకోవచ్చు.

ఇక్కడ దుల్కర్‌ను తప్పకుండా అభినందించాలి. అతను మంచి నటుడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గాన్ని కూడా సంపాదించుకున్నాడు. అయితే అసలు పాయింట్ అతను మన సినిమాలు చేస్తున్నాడని సంతోషించడం కాదు.

మన తెలుగు హీరోల్లో, నిర్మాతల్లో కూడా ఎవరైనా ఈ తరహా ఆలోచనకు పూనుకుంటే, ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే బాగుంటుంది. ప్రతి హీరో తన Market పెంచుకోవాలనే ప్రయత్నంలోనే ఉండాల్సిన అవసరం లేదు. తనకున్న Market పరిధిలోనే మంచి Contentతో, Sensible Budgetతో, మంచి సినిమాలు తీసి నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టవచ్చు.

ఎందుకంటే సినిమా వ్యాపారంలో ఎప్పుడూ హీరో Market పెద్దదవ్వాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి సినిమా Marketకు తగ్గట్టుగా హీరో ఉంటే చాలు!

—- కళ్యాణ్ కిషోర్.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments