విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. నేటి ట్రెండ్‌కు తగ్గ కథ, కథనం, బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో పాటు మనసును హత్తుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసేలా ‘హైకూ’ టీజర్‌ను రూపొందించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది!!

