యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ప్రదీపన్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ రేపు లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

