ఎస్ఎంఎస్, ప్రేమ కథా చిత్రమ్, సమ్మోహనం, భాగి (హిందీ) వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు.. విలక్షణమైన కథలు, క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తూ

విజయ పధం లో పయనిస్తున్న సుధీర్ బాబు జన్మదినం మే 11. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు సుధీర్ బాబుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సుధీర్ బాబు భవిష్యత్తు ప్రాజెక్టులు చక్కని విజయాలు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు.
సుధీర్ బాబుని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల జె.వి. ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి,
కార్యవర్గ సభ్యులు ఆర్.డి.ఎస్. ప్రకాష్, నవీన్ కుమార్, జిల్లా సురేష్ తదితరులు ఉన్నారు.

