ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందరి జీవితాల్లోనూ పండగ నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు వైస్ చైర్పర్సన్ CSR అపోలో హాస్పిటల్స్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై సుమ దంపతుల్ని అభినందించారు!!

