HomeEntertainmentబాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న భైరవ ద్వీపం రీ రిలీజ్

బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న భైరవ ద్వీపం రీ రిలీజ్

- Advertisment -

గత కొన్ని నెలలుగా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్‌లు అనేవి ఎక్కువగా ఉండేవి. శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఆ కోవలో ఇప్పటికే మురారి, పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ,సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ వంటి చిత్రాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లనే సాధించాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్‌ ‘భైరవ ద్వీపం’సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను లెజెండ్రి దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించారు.ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది.

Bhairava Dweepam movie re release on June 10th

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments