ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ టివి థియేటర్ అభివృద్ధి సంస్థ (FDC) చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీ పి.భరత్ భూషణ్ పేరుకే మొగ్గు చూపించింది. వైస్ చైర్మన్ గా దర్శకుడు శ్రీ మెహర్ రమేష్ ను ఎంపిక చేసింది.
14 మంది డైరెక్టర్లను నియమించింది. సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు శ్రీ బుర్రా సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించారు. అలాగే హీరో శ్రీ సుమన్ తల్వార్, హీరో శ్రీ శివాజీ, నిర్మాతలు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు, శ్రీ కూచిభోట్ల వివేకానంద, నటి శ్రీమతి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు శ్రీ వి. సముద్ర, శ్రీ మీర్ ఎస్., శ్రీ ఎ.సత్యనారాయణ, శ్రీ ఎస్.వెంకట కృష్ణారెడ్డి, శ్రీ జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, శ్రీ డి. సత్యనారాయణ లను డైరెక్టర్లుగా నియమించారు.
ఇక టివి, సినిమా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినిమా, టివి షూటింగులు జరిగేందుకు, సినీ, టివి, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు!!

