నివిన్ పాల్ – మమితా బైజు జంటగా నటించిన “బెత్లహాం కుటుంబం యూనిట్” అక్కడి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మలయాళంలో 300 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి చిత్రంగా చరిత్రకెక్కింది. అయితే, అదే పేరుతో తెలుగులో వచ్చిన ఈ చిత్రం ఇక్కడ అంత ప్రభావం చూపించలేకపోయింది. “ఇరుముడి” ప్రభంజనం అందుకు ఒక కారణమైతే… టైటిల్ మరో కారణం. “బెత్లహాం కుటుంబం యూనిట్” అనే టైటిల్ తో మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ పరంగా తెలుగులో శ్రద్ధ తీసుకోవకపోవడం మరో ముఖ్య కారణం. ఏది ఏమైనా వరుస విజయాలతో మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోయిన్ గా మారింది!!

