HomeEntertainmentస్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న శ్రీలీల

స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న శ్రీలీల

- Advertisment -

ఒక దశలో టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ అంటే శ్రీలీలే. జయాపజయాలతో సంబంధం లేకుండా…. వరుస అవకాశాలతో అగ్ర హీరోల సరసన నటిస్తూ, నిర్మాతల తొలి ఎంపికగా నిలిచింది. అయితే కొన్నిసినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆమె కెరీర్ వేగం కాస్త తగ్గినట్టు కనిపించింది. అదే సమయంలో శ్రీలీల తన ఎంపికల్లో మార్పు తీసుకొచ్చింది. కేవలం ఎక్కువ సినిమాలు చేయడం కాకుండా, మంచి కథలు, బలమైన పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. డ్యాన్స్, గ్లామర్ మాత్రమే కాదు… నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు శ్రీలీలకు మంచి డిమాండ్ ఉంది. ఆమె ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన బలాలు. సరైన కథలు, సరైన పాత్రలు దొరికితే మరోసారి టాలీవుడ్‌లో గోల్డెన్ రన్ మొదలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన “లెనిన్” సినిమాలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలనే ఎంపిక చేశారు. ఒక షెడ్యూల్ సైతం షూట్ చేశాక, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు. శ్రీలీల ఉండి ఉంటే… ఆ సినిమా కూడా ఆడి ఉండేది కాదని కొందరు నెగటివ్ కామెంట్స్ సైతం చేశారు. అయినా శ్రీలీల స్థిరమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments