నటి అనన్య నాగళ్ళ చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం
హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా “కొణికి లక్స్” పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది. టాలీవుడ్ స్టార్ నటులకు, సెలెబ్రిటీకు హెయిర్ స్టైల్ చేయడంలో ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు నేతత్వంలో ఆమెతో కలిసి ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటి అనన్య నాగళ్ళ గారి చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం జరిగింది.

అనన్య నాగళ్ళ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు 500 సినిమాలలో హెయిర్ స్టైలిస్ట్ గా చేసిన రామ్ కొణికి గారి కొణికి సెలూన్ కి వచ్చేసాను. అయితే ఇంత కాలం నుండి హెయిర్ స్టైలిస్ట్ గా చేసిన రామ్ గారు ఇప్పుడు స్కిన్ కేర్ మొదలు పెట్టారు. కొణికి లక్స్ తో ఇక నుండి చర్మానికి సంబంధించిన అన్ని క్లినికల్ ట్రీట్మెంట్స్ నిపుణులైన వైద్యుల నేతృత్వంలో స్కిన్ సంబంధిత అన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలలో కొణికి సెలూన్ ఎంతో విజయవంతంగా కొనసాగటం మనం చూస్తున్నాము. విదేశాలలో ఉండే అత్యుత్తమ ఆధునిక పరికరాలతో టెక్నాలజీ ఉపయోగించి అన్ని రకాల స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ చేస్తారు” అని అన్నారు.
