HomeEntertainment"సుభాష్ కె రాజ్"

“సుభాష్ కె రాజ్”

- Advertisment -

(ధీరజ అప్పాజీ)

అనే పేరు మనం
ముందు ముందు
మరింత వింటాం!!

ఇప్పుడే నేను “బ్లాస్ట్ జోన్” అనే
తమిళ డబ్బింగ్ సినిమా ప్రసాద్
ఐమాక్స్ లో చూసి బయటికి వచ్చాను!!

నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు… ఈ సినిమా ఇంత బాగుంటుందని!!

ఒక రేంజ్ లో ఉంది ఈ సినిమా.
నాకైతే భలే నచ్చేసింది!!

ఈ చిత్రంతోనే
“సుభాష్ కె. రాజ్”
డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు!!

“వన్ పిక్చర్ వండర్”లా
మిగిలిపోతే చెప్పలేం కానీ…
లేకపోతే… కచ్ఛితంగా
అతని పేరు ముందుముందు
చాలా గట్టిగా వినిపిస్తుంది!!

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పార్క్ హయత్ లో కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ కి నేను కూడా అటెండ్ అయ్యాను. అప్పుడే ఈ కుర్రాడిని చూశాను. అప్పుడే అనుకున్నాను… “ఏంటి చాలా కుర్రాడిలా ఉన్నాడు?” అని!!

ఆరోజు ఈవెంట్లో యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ ఈ అబ్బాయి గురించి ఒక మాట చెప్పాడు. “పిట్ట కొంచెం కూత ఘనం” అనే సామెత ఈ అబ్బాయికి వర్తిస్తుందని చెప్పాడు!!

సినిమా చూసి బయటకు వచ్చాక అర్జున్ చెప్పింది 100% నిజం అని అనుకోకుండా ఉండలేకపోయాను!!

ముఖ్యంగా యాక్షన్ లవర్స్ కి
“ఫుల్ మీల్స్”లాంటి సినిమా ఇది!!

యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి,
ప్రీతి ముకుందన్…… ముగ్గురూ పోటాపోటీగా అదరగొట్టేశారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments