
ధర్మన్’ చిత్రంతో రామ్ పోతినేని కెరీర్లో మరో కీలకమైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సినిమాతో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ అన్ని భాషల ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు!!
