Thursday, February 5, 2026
HomeEntertainmentకామెడీ ఎంటర్టైనర్ "అది ఒక ఇదిలే" ఆమెజాన్ లో స్ట్రీమింగ్ !!!

కామెడీ ఎంటర్టైనర్ “అది ఒక ఇదిలే” ఆమెజాన్ లో స్ట్రీమింగ్ !!!

- Advertisment -

తెలుగు కామెడీ మూవీ “అది ఒక ఇదిలే” అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రొమాంటిక్ కామెడీ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో స‌బ్య‌సాచి మిశ్రా, రాధిక ప్రీతి, శ్యామ్, మహి, తేజో వికాస్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స్వ‌ర్ణ మాస్ట‌ర్‌ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్ర‌ఫీ కూడా స్వ‌ర్ణ మాస్ట‌ర్‌ అందించ‌డం విశేషం. ముర‌ళీధ‌ర్ మ్యూజిక్ అందించాడు.

ప్రేమ‌, స్నేహం, కామెడీ అంశాల‌తో స్వ‌ర్ణ‌ ఈ మూవీని తెర‌కెక్కించారు. మహి, సిద్ధు, మిథున్ చిన్న‌నాటి మిత్రులు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటుంటారు. ముగ్గురూ ఎప్పుడూ అన్నోన్యంగా ఉంటారు. పూజా …
మహి, సిద్ధు, మిథున్ లో ఎవరిని ఇష్టపడుతుంది అనేది సినిమాలో అందంగా చూపించడం జరిగింది. వీరిమధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి, చిన్న సస్పెన్స్ తో స్క్రీన్ ప్లే రన్ అవుతుంది, పూజా ఎవరికి సొంతం అనేది చివరివరకు ప్రేక్షకులకు సస్పెన్స్ తో సాగే ఎమోహన్స్ తో ఉంటుంది.

శ్రీధర్ నార్ల సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మురళీధర్ రాగి ఐదు మంచి పాటలను అందించారు, వైజాగ్ ,అరకు, భువనేశ్వర్ వంటి మంచి లొకేషన్స్ లో సాంగ్స్ ను చిత్రీకరించడం జరిగింది, ఈ చిత్రానికి బుల్ రెడ్డి ఎడిటర్ గా వ్యవహారించారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments