HomeEntertainmentయంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న “భగవంతుడు” మూవీ...

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న “భగవంతుడు” మూవీ షూటింగ్ పూర్తి.. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం!

- Advertisment -

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు.

సాంకేతిక బృందం

  • ఆడియో : మధుర
  • కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
  • యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
  • పాటల రచయితలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్,జి.జి. విహారి
  • కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
  • సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
  • సంగీతం: కె.పి.
  • ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల
  • పీఆర్ఓ: సురేష్ (ఎస్‌కే మీడియా)
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – జి. జి. విహారి
  • బ్యానర్: రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
  • నిర్మాత: రవి కుమార్ పనస
  • సహ నిర్మాత: విద్య శ్రీ పనస

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments