HomeEntertainmentజీ5లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి...

జీ5లో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి

- Advertisment -
  • అక్టోబ‌ర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌.. అక్టోబ‌ర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజ‌న్‌లో ప్ర‌సారం

మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బ‌య‌ట‌కు తెలిజ‌యేసే సంభాషణలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఆసక్తికరమైన విషయాలు, వినోదభరితమైన విశేషాలతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించనుంది.

ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో.. వెండితెరపై కనిపించే తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొని, తమ వ్యక్తిగత జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, అనుబంధాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు ప్రధాన ఆకర్షణ. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడే అవకాశం ఈ షో కల్పిస్తోంది. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఇదే ప్రత్యేకమైన సంభాషణల శైలిలో మరిన్ని వ్యక్తిగత విశేషాలు, ఆసక్తికరమైన ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా కొత్త సీజన్ సాయి ప‌ల్ల‌వితో ప్రారంభం కానుంది. న‌టిస్తోన్న‌ పాత్రల్లో సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ, భావోద్వేగాలతో పాటు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘సీత’ పాత్రతో ప్రేక్షకుల్లో ఆమెపై అభిమానం మరింత పెరిగింది. చాలామంది ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావిస్తూ ‘మా సీత’ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా టైటిల్‌ను ప్రకటించిన తర్వాత సాయి పల్లవి పాల్గొంటున్న తొలి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె, మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా పంచుకునే విధానం సాయి పల్లవిని సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి, జగపతిబాబుతో కలిసి ఆహ్లాదకరమైన, ఆసక్తికరంగా మాట్లాడ‌బోతున్నారు. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఇప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె ఈ సందర్భంగా తెలియ‌జేయ‌నున్నారు. ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించనున్నారనే ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, జీవితంలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులకు లభించనుంది. జగపతిబాబు తనదైన శైలిలో సంభాషణను ముందుకు నడిపించనుండటంతో.. ఇద్దరి మధ్య జరిగే ఈ ముచ్చట్లు సహజమైన హాస్యం, ఆత్మీయతతో ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఈ గ్రాండ్ లాంచ్‌తో రెండో సీజన్‌కు శ్రీకారం చుట్టడమే కాకుండా.. వెండితెరపై అభిమానించే తారల వ్యక్తిగత జీవితాలకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసే ప్రయత్నం చేయనున్నారు. హాస్యం, పాత జ్ఞాపకాలు, మనసు విప్పి మాట్లాడుకునే సంభాషణలు, వ్యక్తిగత అనుభవాల కలయికగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో సాగనుంది. సాధారణ ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు భిన్నంగా.. సినిమా విశేషాలకే పరిమితం కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిత్వం, వారి జీవిత ప్రయాణం, అనుభవాలకు ఈ షో ప్రాధాన్యత ఇవ్వనుంది.

‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి సందడి చేయనుండటంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెరపై తారలుగా కనిపించే సెలబ్రిటీల వెనుక ఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని, వారి జీవితంలోని ఆసక్తికరమైన కథలను ఆవిష్కరిస్తూ ఈ షో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments