రాజమహేంద్రవరం అక్టోబర్ 11: జిత్ మోహన్ మ్యూజిక్ అకాడమీ సింగర్స్ 6వ వార్షికోత్సవ సందర్బంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ 85వ జన్మదిన సందర్బంగా వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో ఆదివారం సాయంత్రం కార్యక్రమం నిర్వహించారు. జిత్ మోహన్ మిత్రకను అమితాబ్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. పలువురు పూలమాలాలతో సత్కరించారు. ముద్రగడ ఏసుబాబు జ్యోతి ప్రకాశనం చేశారు. నూజిళ్ళ సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రామకృష్ణ, వి. జగపతి, పివిఎస్ కృష్ణారావు, రవీంద్రనాథ్, ప్రసాదరావు, జె శివప్రసాద్, సుంకర వీర శేఖర్, షేక్ ఖాసిం, ఏ ఎస్ ఆనంద్, గుమ్మడి సమర్పణ రావు, సుక్కురెడ్డి శ్రీనివాసరావు, బి. సీతారామారావు, వంక బాలకృష్ణ, శ్రీహరి, ఎం సూర్య కుమారి, సోమయాజులు, ఎం కృష్ణ, జీవిఎస్ లక్ష్మీ, డి ఎస్ శ్రీనివాసరావు, పిచ్చుక మహేష్, శ్రీపాద శంకరరావు, వర ప్రసాద్, రేవతి, వడ్డాది నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ బాలీవుడ్ నటుడు అమితాబ్ అవార్డును ఆర్కెస్ట్రా పితామహుడు జిత్ మోహన్ మిత్రకు ఇవ్వడం సముచితమని పలువురు పేర్కొన్నారు. ముందుగా వంక బాలకృష్ణ సారథ్యంలో సంగీత విభావరి జరిగింది.

