Thursday, February 5, 2026
HomeNewsరేపు పైడి జయరాజ్ 116వ జయంతి

రేపు పైడి జయరాజ్ 116వ జయంతి

- Advertisment -

వెండితెరపై పైడి జయరాజ్ కీర్తి పతాకం
తెలుగు సినీమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి కారకులు
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారకులు
1969 తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక తోడ్పాటు అధించింది జయరాజ్
అమితాబచ్చన్ సినిమా యాక్టర్ కావడానికి కారకుడు
సినీ కళాకారుల సంక్షేమం కోసం తన ఇల్లు నే వితరణ చేసిన మహానుభావుడు
తెలుగు జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నిర్మాత,నటుడు

పైడి జయరాజ్ 116 పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్‌లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందారు.కరీంనగర్ లో జన్మించిన పైడి జయరాజ్ హైదరాబాద్ వ్యాయామశాలలో శిక్షణ పొంది, జాతీయ చలనచిత్ర సీమను కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన గొప్ప నటుడు. సినిమాల్లో నటించాలన్న తన కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని గెలిచిన జైరాజ్ జీవితం నేటి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించింది, దాదాపు 700లకు పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. 11 అమెరికన్ సినిమాలో నటించారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments