HomeEntertainmentజీ5 తమిళ ప్రేక్షకులకు హాయ్ చెబుతున్న నయనతార

జీ5 తమిళ ప్రేక్షకులకు హాయ్ చెబుతున్న నయనతార

- Advertisment -

నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెరపై వారి కెమిస్ట్రీ కథకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. నయనతార.. ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్వతంత్ర భావాలున్న మహిళ పాత్రలో సహజంగా ఒదిగిపోయారు. ఇక కవిన్.. నిజాయతీ, అమాయకత్వం కలగలిసిన యువకుడిగా ఆకట్టుకున్నారు. అతడి పాత్రలో కనిపించే సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇద్దరి నటన సహజత్వం ఉట్టిపడేలా, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను ఆవిష్కరించాయి. విష్ణు ఎడ్వన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం జీ5 తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments